![నేటి నుంచి వైజాగ్‌లో ఉబర్ సేవలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71435776748_625x300.jpg.webp?itok=dNi5fZGz)
నేటి నుంచి వైజాగ్‌లో ఉబర్ సేవలు
ముంబై: ఉబర్ కంపెనీ తన ట్యాక్సీ సేవలను వైజాగ్‌లో గురువారం నుంచి ప్రారంభించనుంది. వైజాగ్‌తోపాటు ఉబర్ ట్యాక్సీ సేవలు భువనేశ్వర్, కోయంబత్తూరు, ఇండోర్, మైసూర్, నాగ్‌పూర్, సూరత్ వంటి ఆరు టైర్-2 పట్టణాల్లో కూడా ప్రారంభంకానున్నాయి. దీంతో ఉబర్ సేవలు దేశంలోని 18 పట్టణాల్లో ఉన్నట్లు అవుతుంది. అలాగే ఉబర్‌కు అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ ప్రాంతంగా మారుతుంది. కంపెనీ నెలవారి వృద్ధి 40 శాతంగా ఉందని ఉబర్ ఇండియా హెడ్ నీరజ్ సింఘల్ తెలిపారు.