అరెస్టు చేసిన నిందితులు
బరంపురం : మూడు రోజుల క్రితం లంజిపల్లి ఓవర్ బిడ్జి దగ్గర గ్యాంగ్‌స్టర్ సుశాంత్ బిశాయిపై బాంబులతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా బుధవారం తెలిపారు. వాళ్ల దగ్గర నుంచి 4 బాంబులు, 4 బైక్‌లు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు బరంపు రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పినాకి మిశ్రా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంజిపల్లి డిప్పవీధిలో నివాసం ఉంటున్న ప్రశాంత్ బిశాయి అతని అనుచరులు వస్తున్న కారుపై ప్రత్యర్ధి సునీల్ బెహరా గ్యాంగ్ ఈ నెల 8వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో బాంబుల దాడి చేసిందన్నారు.
2010లో లంజిపల్లిలో జరిగి న చికన్ రొబి హత్య కేసులో విచారణ ఖైదీగా బరంపురం సర్కిల్ జైల్లో గత 8 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవించి ఇటీవల జామీన్‌పై విడుదలైన సుశాంత్ బిశాయిని హత్య చేసేందు కు చికన్ రోబి గ్యాంగ్‌లో ముఖ్యులైన సునీల్ బెహరా బంజ నగర్ జైల్లో విచారణ ఖైధీగా ఉంటూ జైలు నుంచే పథకం రచించినట్లు చెప్పారు. అప్పటినుంచి సునీల్ బెహరా గ్యాం గ్ సుశాంత్ బిశాయిని హత్య చేయాలని రెండు సార్లు ప్రయత్నించి విఫమైనట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం మొన్న మళ్లీ హత్యాయత్నానికి ప్రయత్నించారన్నారు.
నాలుగు బృందాల దర్యాప్తు
హత్యాయత్నం, విధ్వంసం ఘటనలో నిందితులను పట్టుకొనేందుకు బరంపురం జిల్లాలోని ఇద్దరు ఏఎస్పీలు త్రినాథ్ పటేల్, సంతున్ కుమార్‌తో పాటు టౌన్, సదర్, బీఎన్‌పూర్, గుసానినువాగం, పెద్ద బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి జరిగిన ఘట నపై సవాల్‌గా తీసుకుని మూడు రోజుల నుంచి నగరంలో వివిధ ప్రాంతాల్లో గాలించి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
అరెస్టు అయిన వారిలో బలజిపిల్ల రాజదాస్, లంజిపల్లి డిప్ప వీధి, బర్మా కాలనీకి చెందిన బప్పి మిశ్రా, సునీల్ మిశ్రా, లుచ్చాపడా బొడావీధికి చెందిన సంతోష్ శెట్టి, లంజిపల్లి డిప్పవీధికి చెందిన డిపునా నాయక్, దిగపండి దుబ్బావీధికి చెందిన పింటు బెహరా, బొడకుస్తులి బౌరి వీధికి చెందిన రవీంద్రదాస్, బొడగుమ్మలా గ్రామానికి చెందిన సుశాంత్ సాహు, బొడకుస్తులి బండావీధికి చెందిన సన్యాసి శెట్టిలుగా గుర్తించామన్నారు. మరో ఇద్దరు ముఖ్య నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారని వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పినాకి మిశ్రా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment