సినీనటుడు బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం | actor balakrishna narrow escape from road accident | Sakshi
Sakshi News home page

సినీనటుడు బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం

Published Wed, Jun 29 2016 4:56 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

సినీనటుడు బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం - Sakshi

సినీనటుడు బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం

అనంతపురం : సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. బాలకృష్ణ వాహనంలో హిందూపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా లారీ ఓవర్‌టేక్ చేయబోయినపుడు పశువు అడ్డు రావడంతో డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం కర్ణాటకలోని బాగేపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. అనంతరం బాలయ్య మరో వాహనంలో బెంగుళూరు వెళ్లిపోయారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement