అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన అవసరం
అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన అవసరం
Published Fri, Oct 7 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
– దేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నంబర్ వన్‌గా ఉంచాలి
– ఇస్రో సేవలు దేశానికే గర్వకారణం
– స్పేస్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో డీప్యూటీ సీఎం కేఈ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అంతరిక్ష పరిజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు.సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతికతను అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమస్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెక్నాలజీ ఎక్కువగా వినియోగిస్తూ మంత్రులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. షార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగరాజు, కంట్రోలర్ వి.రాజారెడ్డి మాట్లాడుతూ..సామాన్య ప్రజలు, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కోసమే ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. శాస్త్ర, సాంకేతికపై అవగాహన ఉన్న శాస్త్రవేత్తల కోసం ఇస్రో ఎదురు చూస్తోందన్నారు. ఇస్రో ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం అదృష్టమని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. విద్యార్థులు, ప్రజల కోసం స్వయంగా ఇస్రో అధికారులే స్పేస్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇస్రో చరిత్ర, రాకెట్ల నమూలు, వాటి ప్రయోగాలపై పవర్ ప్రజేంటేషన్ ఆసక్తిని పెంచింది. సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ అనూప్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శౌరీలు రెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జున రెడ్డి, జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్, ఆర్‌ఐఓ వై.పరమేశ్వరరెడ్డి, టౌన్ మోడల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకోలేకపోయిన ఎగ్జిబిషన్..
కేవలం మూడు రాకెట్ల నమూనాలను ప్రదర్శనలో ఉంచడంతో ఎగ్జిబిషన్ ఆకట్టుకోలేక పోయింది. ఇస్రో చరిత్ర, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, దేశంలోని వివిధ ఇస్రో కేంద్రాల విశిష్టతను పెద్ద చార్టుల రూపంలో ఉంచారు. ముందుగా చెప్పిన మాదిరిగా వివిధ రాకెట్లు, వాటి విడి భాగాలు, క్షిపణుల నమూనాలు, ఇతర పరికరాలను ఉంచలేదు. దీంతో ప్రదర్శనలోని అంశాలు విద్యార్థులను ఆకట్టుకోలేపోయాయి. మరికొన్ని నమూనాలను ఉంచి ఉంటే బాగుండేదని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Advertisement