చర్ల: భద్రాద్రి కొత్తగూడెం - జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని వెంకటాపురం మండలంలో మావోరుుస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఓ ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈనెల 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన మావోరుుస్టు పార్టీ బుధవారం రాత్రి చర్ల-శబరి ఏరియా కమిటీ వారు వెంకటాపురం మండలంలోని విజయపురికాలనీ సమీపంలోని ప్రధాన రహదారిపై వాల్‌పోస్టర్లు వేసి, బ్యానర్లు కట్టారు. అరుుతే చర్ల నుంచి వెంకటాపురం వైపునకు సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్న వెంకటాపురానికి చెందిన ఆటో డ్రైవర్ గుగ్గిళ్ల కార్తీక్ అక్కడ ఆగి వాల్ పోస్టర్‌ను గమనిస్తున్న సమయంలో మందుపాతర పేలి తీవ్ర గాయాలపాల య్యాడు.
దీంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంకటాపురం ప్రభుత్వ వైద్య శాలకు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. గురువారం హైదరాబాద్‌కు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టర్లను తొలగించేందుకు కార్తీక్‌ను కూడా పోలీసులే పంపించారనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. క్షతగాత్రుడితో సైతం తానే స్వయంగా వెళ్తూ మార్గమధ్యంలో పోస్టర్లు, బ్యానర్లు కనిపించడంతో ఆగి చూస్తుండగా మందుపాతర పేలిందని పోలీసులు చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.