మాకూ రిజర్వేషన్లు ఇవ్వాలి
మాకూ రిజర్వేషన్లు ఇవ్వాలి
Published Sat, Jul 30 2016 11:49 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
ఎన్‌ఎస్‌ఎస్ వైద్య విద్యార్థుల డిమాండు
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ):
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ వెబ్‌సైట్‌ను వీసీ డాక్టర్ టి.రవిరాజు లాంఛనంగా ప్రారంభించారు. వర్సిటీ జాతీయ సేవా పథకం సలహామండలి సమావేశం శనివారం వర్సిటీలో జరిగింది. ఎన్‌సీసీ విద్యార్థులకు మాదిరిగా తమకు కూడా పీజీ మెడికల్ అడ్మిషన్లలో 1శాతం కోటాను అమలు చేయాలని ఎన్‌ఎస్‌స్ వాలంటీర్లు వీసీని కోరారు. ఆయన స్పందిస్తూ ఇతర రాష్ట్రాలోని యూనివర్సిటీల్లో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు రిజర్వేషన్ కోటా ఏ విధంగా అమలవుతోందో పరిశీలించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా అమలుచేసేందుకు ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే పుష్కరాల్లో వర్సిటీ తరుపున 500 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను సేవలకు వినియోగిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ పి.రామచంద్రరావు, రీజినల్ డైరెక్టర్ గోకుల కృష్ణన్, సలహామండలి కార్యదర్శి డాక్టర్ కొల్లి శ్రీకరుణమూర్తి, వర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురా«ద, ఫైనాన్స్ అధికారి రమాదేవి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, డాక్టర్ గంగాధర్‌రావు, అర్జునరావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టీఎస్‌ఎన్ మూర్తి, డాక్టర్ టీఎస్‌ఆర్ సాయి, డాక్టర్ టి.మురళీమోహన్, డాక్టర్ ఆనందకుమార్, కోటేశ్వరీ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ వివేకనంద, ఆదిరెడ్డి, పరదేశినాయుడు, కేవీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement