sp trivikram varma
నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోం.. l
Published Fri, Sep 9 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
- నేటి బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించాలి
-జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు
- విలేకరులతో ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ
ఒంగోలు క్రైం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా శనివారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారితే ఊరుకునేది లేదని ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్‌వర్మ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఐటీ కోర్ సెంటర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బంద్‌కు సంబంధించి పోలీసుల ఆంక్షలు వివరించారు. ఓఎస్డీ(అడ్మిన్)ఏ.దేవదానం, ఎస్‌బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజుతో కలిసి ఎస్పీ మాట్లాడుతూ బంద్‌ను ప్రశాంతంగా చేసుకోవాలని సూచించారు. జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. హింసాత్మకాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. బలవంతంగా దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. ఆర్టీసీ బస్సులను కూడా బలవంతంగా ఆపకూడదన్నారు. ప్రభుత్వ ఆస్తులు, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయకూడదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లేవిధంగా చేస్తే చర్యలు కఠినంగా తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తామని కూడా హెచ్చరించారు. బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని మూడు రెవెన్యూ సబ్ డివిజన్లలో ఆర్డీఓల ద్వారా 144 సెక్షన్ విధించేలా కలెక్టర్ ద్వారా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మండలాల స్థాయిలో పోలీసులను అప్రమత్తం చేశామని, జిల్లాలోని ఐదు పోలీసు సబ్ డివిజనల్(డీఎస్పీ)స్థాయి అధికారులకు ముందస్తుగా సూచనలు చేశామని వివరించారు. భారీ స్థాయి బైక్ ర్యాలీలు నిర్వహించకూడదని ఎస్పీ సూచించారు.
Advertisement