కోహీర్: విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ సుధీర్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించామని క్లస్టర్ వైద్యాధికారి వెంకట్ రంగారావు తెలిపారు. శనివారం ఆయన కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం విధులకు హాజరై ఎలాంటి అనుమతి లేకుండా మధ్యాహ్నం నుంచి వెళ్లి పోయారని తెలిపారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందలేదన్నారు.
స్థానిక అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారి అధికారి అమర్‌సింగ్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని, దీంతో తరుచుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీ కోసం జిల్లా వైద్యాధికారికి నివేదిక పంపిస్తామన్నారు. ఆస్పత్రి పనివేళల్లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.