‘సర్వే’ జిమ్మిక్కులు సాగన్విం
‘సర్వే’ జిమ్మిక్కులు సాగన్విం
Published Sun, Sep 25 2016 10:31 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
– ఆందోళనలు ఉధృతం చేస్తాం
– అధికార పార్టీతో సహా అఖిల పక్షం నిర్ణయం
వేలేరుపాడు:
ప్రభుత్వం ఏదో జిమ్మిక్కులు చేసి ఆర్‌ఆర్ ఇండ్ల సర్వే చేపట్టి, నిర్వాసితులను నిండా ముంచాలని చూస్తోంది. లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయమిది. ప్రభుత్వ నిర్ణయంలో ఒక స్పష్టతరాకుండా అధికారులు ఏదో చేయవచ్చనుకుంటే, చూస్తూ, ఊరుకోమని అధికారపార్టీతోసహా అఖిల పక్షం నేతలు ముక్తకంఠంతో ప్రకటించారు. అక్టోబర్ ఒకటొవతేదీనుండి వేలేరుపాడు మండలంలో ఆర్‌ఆర్ ఇండ్ల సర్వే చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించిన నేపధ్యంలో తహశీల్దార్ శ్రీనివాస్ మండలంలోఅఖిల పక్షనేతలతో ఆదివారం సమావేశంlనిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీనేతలతో సహా, అన్ని పార్టీల నేతలు, వివిధ గ్రామాల నిర్వాసిత రైతులు తమశీల్దార్‌ను నిలదీసారు. 2006,2007 సంవత్సరాల్లో నాటి ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఇష్టం లేకపోయినా ఎకరం లక్షా15వేలకే భూములను ప్రభుత్వానికి అప్పగించామని, పలువురు రైతులు వాపోయారు. ఈ తొమ్మిదేళ్ళలో తాము అనేక వి«ధాలుగా చితికిపోయామని. ఈ తరుణంలో పాత చట్టం ప్రకారం ఆర్‌ఆర్ ఇండ్ల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలియడంతో తామెంతో ఆందోళనకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు. 2013 నూతన భూసేకరణ చట్టం ప్రకారం ఎందుకు పరిహారం ఇవ్వరంటూ ప్రశ్నించారు. దీని పై తహశీల్దార్ స్పష్టత ఇవ్వలేకపోయారు. ముందు సర్వే చేపట్టి తదనంతరం పరిహారం ప్రకటిస్తామని, పరిహారం ఎంత అన్నది తమ చేతిలో లేదని, ప్రభుత్వమే ప్రకటించాల్సి ఉందని చెప్పడంతో అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్‌ఆర్ ప్యాకేజీ వివరాలు ప్రకటించకుండా సర్వే చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత ఉదృతం చేయాలని అఖిల పక్షనేతలు నిర్ణయించారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయింపు...
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వాలంటూ అఖిల పక్షనేతలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. పరిహారం ప్రకటించేవరకు సర్వే నిలసాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చీమల వెంకటేశ్వర్లు, మాచర్ల వెంకటేశ్వర్లు, శాఖమూరి సంజీవులు, బీజేపీ నాయకులు గేరా హనుమంతురావు, అశ్వారావుపేట సీపీఐ నియోజకవర్గకన్వీనర్ ఎండీ,మునీర్, వైసీపీమండలకన్వీనర్, కేసగానిశ్రీనివాసగౌడ్. బద్దెకష్ణ, రేపాకగొమ్ముసర్పంచ్ కారంవెంకటరమణ, దొరబాబు. పెంటారావు, న్యూడెమోక్రసీ నాయకులు ఎస్‌కెSగౌస్,పూరెం. లక్ష్మయ్య, గడ్డాల ముత్యాల్‌రావు, కారందారయ్య, కాంగ్రేస్ మండల అధ్యక్షులు కొల్లూరి సత్తిపండు, పలివేల చినరాజు, వలపర్ల రాములు, గుద్దేటి భాస్కర్, షఫీ, మాచర్ల హరిబాబు సీపీఎం,నాయకులు సత్యనారాయణ, జాన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement