వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ: వరి సాగు చేస్తే పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువగా వచ్చి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. వరితో ఉరే శరణ్యంలా పరిస్థితి తయూరైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చిన రైతు సాయిలుతో మాట్లాడారు. తాను వరి పండించేందుకు రూ. 30 వేలు ఖర్చు చేయగా, 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, అమ్మితే రూ.35 వేలు వస్తాయని చెప్పాడు.
దీంతో మంత్రి పోచారం మాట్లాడుతూ వరి సాగుతో రైతులకు ఒరిగేదమీ లేదని, ఆరు నెలలు కష్టపడితే రూ. 5 వేలే వస్తాయన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూరగాయలు, వాణిజ్య పంటలు, పండ్లు, పూల మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సేంద్రియ ఎరువులనే వాడాలని సూచించారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీలున్న మెదక్, బోధన్, మెట్‌పల్లి చెరుకు రైతులకు సంబంధించిన బకాయిలను కూడా విడుదల చేశామన్నారు.
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు
Published Mon, Oct 19 2015 4:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement