హ్యాండ్‌బాల్ చాంపియ న్..పశ్చిమ
హ్యాండ్‌బాల్ చాంపియ న్..పశ్చిమ
Published Mon, May 15 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM
ఏలూరు రూరల్: జిల్లా హ్యాండ్‌బాల్ బాలికల జట్టు చాంపియ న్‌షిప్ సాధించింది. ఈ నెల 11, 12 తేదీల్లో శ్రీకాళహస్తిలో నిర్వహించిన సబ్ జూనియర్ బాలికల జట్టు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచింది. ఆదివారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ మాట్లాడుతూ నిరంతర సాధన, పట్టుదలతో జిల్లా బాలికలు చాంపియన్లుగా అవతరించారని కొనియాడారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష న్ అధ్యక్షుడు పీఆర్ లెని న్ మాట్లాడుతూ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చారన్నారు. టోర్నీలో సత్తా చాటిన డి.స్వాతి, పి.మల్లిక, సీహెచ్ అనూష, కె.పావని, సీహెచ్ దుర్గారాణి, డి.రాశి రాష్ట్ర జట్టుకు ఎంపికయినట్టు కార్యదర్శి టి.కొండలరావు తెలిపారు. వీరు త్వరలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ సాయ్థి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. విజేతలతో పాటు శిక్షకులు కె. ప్రసన్నకుమారి, ఆర్ రవిమోహ న్‌కుమార్‌లను అభినందించారు.
Advertisement
Advertisement