బాధితులకు బాసటగా.. | help to victims | Sakshi
Sakshi News home page

బాధితులకు బాసటగా..

Published Thu, Aug 25 2016 1:41 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

బాధితులకు బాసటగా.. - Sakshi

బాధితులకు బాసటగా..

వేల్పూరు (తణుకు) : ఖమ్మంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ బాసటగా నిలిచింది. ఆ కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని వైఎస్సార్‌ సీపీ నేతలు ధైర్యం చెప్పారు.  ఈ ప్రమాదంలో మరణించిన తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కొప్పాడ జ్ఞానసుందర్‌సాయి కుటుంబాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బుధవారం పరామర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు పరామర్శించారు. సాయి తల్లి మంగామణి, సోదరి తేజశ్రీలను ఓదార్చారు. తమ వంతుగా రూ.50వేల సాయం అందజేశారు. సుందర్‌సాయి ఉద్యోగం సంపాదించి వచ్చిన మొదటి జీతం తీసుకుని తల్లి వద్దకు వచ్చే క్రమంలో ఈ ఘోరం జరగడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాము వచ్చామని, సాయి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సుమంత్‌సాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్‌.ఎస్‌.రెడ్డి, నాయకులు బలగం సీతారాం, నార్గన సత్యనారాయణ, బోడపాటి వీర్రాజు, గుణ్ణం నారాయణరావు, ఆకుల సోమరాజు, మాసిన నరేంద్ర, కర్రి కాశీరెడ్డి, బూసి వినీత, పెన్మత్స రామరాజు, గుర్రాల నాగేంద్ర, రెడ్డి భగవాన్లు, గుణ్ణం వెంకటరామన్న, చుండ్రు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement