పెట్రోల్‌ కల్తీపై ఏఎస్‌ఓ విచారణ | inquiry on adulteration petrol | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ కల్తీపై ఏఎస్‌ఓ విచారణ

Published Sat, Jul 23 2016 6:28 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

పెట్రోల్‌ కల్తీపై ఏఎస్‌ఓ విచారణ - Sakshi

పెట్రోల్‌ కల్తీపై ఏఎస్‌ఓ విచారణ

తాండూరు రూరల్‌: తాండూరులోని హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఉన్న ఐఓసీ పెట్రోల్‌ బంక్‌లో కల్తీపై అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం కొందరు వాహనదారులకు ఈ బంక్‌లో పెట్రోల్‌ పోయగా కల్తీగా అనుమానం రావడంతో నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యతతో పాటు తూకంలో మోసాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వికారాబాద్‌ డివిజన్‌ ఏఎస్‌ఓ రుక్మిణి శనివారం సదరు పెట్రోల్‌ బంక్‌లో కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టారు. వాహనదారులతో పాటు సిబ్బందితో మాట్లాడారు. బంక్‌లో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇండియన్‌ ఆయిల్‌ సేల్స్‌మన్‌ విజయ్‌కుమార్‌ సైతం దీనిపై విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement