మంత్రులు రాజీనామా చేయాలి: గోలి
మంత్రులు రాజీనామా చేయాలి: గోలి
Published Sun, Jul 31 2016 8:03 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
కనగల్ : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే ఎంసెట్ పేపర్ –2 లీకైనందున నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితోపాటు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే మోదీతో మనం మహాసమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మండలకేంద్రంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోలి మాట్లాడుతూ భారత ప్రధాని ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మిషన్ భగీరథతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలను ప్రారంభించేందుకు గజ్వేల్‌కు వస్తున్నట్లు వివరించారు. అనంతరం ఎల్‌బీ స్టేడియంలో బీజీపీ కార్యకర్తలు, నాయకులతో మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ఎరువుల ధరలు తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్లు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారని తెలిపారు. ఈనెల 4వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్ష హోదాలో నల్లగొండకు మొదటిసారి వస్తున్నట్లు తెలిపారు. ఆదే రోజు జిల్లా అధ్యక్షుడిగా సంకినేని వెంటేశ్వర్‌రావు ఎన్నిక కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతెపాక సాంబయ్య, చెదురుపల్లి సైదులు, తిరందాసు కనకయ్య, పోలోజు భిక్షమాచారి, పోతెపాక లింగస్వామి, యాకాలపు కొండల్, చేపూరు షణ్ముకాచారి, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement