‘మంత్రులు రాజీనామా చేయాలి’
Published Thu, Aug 11 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
షాద్‌నగర్‌రూరల్: ఎంసెట్ పేపర్–2 లీకేజీకి సంబంధించిన మంత్రులు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఏబీవీపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు కావలిశరత్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లి వివేకానంద డిగ్రీకళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంసెట్–2 లీకెజీ పేపర్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కావలిశరత్‌కుమార్ మాట్లాడుతూ ఎంసెట్ పేపర్‌ను లీకుచేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు పేపర్ లీకెజితో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎంసెట్ పేపర్ లీకెజికి బాధ్యత వహించిన మంత్రులు కడియంశ్రీహరి, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ కన్వీనర్ పాపిరెడ్డి, రమణలను సస్పెండ్ చేసిన తరువాతనే ఎంసెట్–3ని నిర్వహించాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం విద్యారంగాన్ని నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుందన్నారు. ఎంసెట్–2 స్కాంపై హైకోర్టు పర్యవేక్షణలోసీబీఐతో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎబివిపి నాయకులు మల్లేష్, సురేష్, శివానంద్, వినోద్, ప్రవీణ్, సూర్యప్రకాష్, శ్రీకాంత్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement