నాటకంతో ఆత్మసంతృప్తి | Naidu gopi interview with sakshi | Sakshi
Sakshi News home page

నాటకంతో ఆత్మసంతృప్తి

Published Sun, Jan 24 2016 10:03 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

నాటకంతో ఆత్మసంతృప్తి - Sakshi

నాటకంతో ఆత్మసంతృప్తి

తిరుపతి  : చిన్న చిన్న డ్రామాలే ఆయన్ని నటన వైపు మళ్లించాయి. దీంతో ఆయన ఆ  రంగాన్నే వృత్తి,ప్రవృత్తిగా మార్చుకున్నారు.  అగ్రస్థానంలో నిలిచారు. దీంతో రంగస్థలమే  ఆయన ఇంటి పేరుగా మారింది. ఆయనే నాయుడు గోపి. నంది నాటకాలకు వచ్చిన సందర్భంగా ఆయనతో ముఖాముఖి.
 
ప్ర: నాటకరంగంలో ప్రవేశం ఎలా జరిగింది.
జ : మాది గుంటూరు జిల్లా పెద్దకాకాని గ్రామం. చదువుకునే రోజుల్లో చిన్నచిన్న  డ్రా మాలు వేసి, బహుమతులు సాధించాను. అలా నాకు నాటక రంగంపై ఆసక్తి ఏర్పడిం ది. 1980లో గుంతకల్లులో రైల్వేశాఖ నిర్వహించిన నాటక పోటీల్లో తొలి ప్రదర్శనకు అవార్డు వచ్చింది. ఆ స్ఫూర్తితో నాటక రం గంలో కొనసాగుతున్నాను.
 
ప్ర: సినీ అవకాశాలు ఎలా దక్కాయి?
జ :  హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శించిన హింసధ్వని నాటికకు మంచి స్పంద న వచ్చింది.  దీంతో  పరుచూరి బ్రదర్స్ ద్వారా 1996లో  సింగన్న సినిమాలో తొలి అవకాశం వచ్చింది.  
 
ప్ర: సినిమా, నాటకానికి మధ్య వ్యత్యాసం?
జ : నాటక ప్రదర్శనతో ఆత్మసంతృప్తి కలుగుతుంది.   సినిమాతో అది ఉండదు. ప్రేక్షకుల ఎదుట ఆత్మ సంతృప్తి కోసం సొంత డబ్బు వెచ్చించి ప్రదర్శించేది నాటకం. సంపాదన కోసం నటించేది సినిమా.
 
ప్ర: నాటక రంగానికి మీరు చేస్తున్న కృషి?
జ: తల్లిదండ్రు లు నాకు జన్మని చ్చారు. నాటకరంగం జీవితాన్నిచ్చింది. నాకు జీవితాన్నిచ్చిన ఈ నాటక రంగం రుణం తీర్చుకోవడానికి నావంతు కృషి చేస్తున్నా. అందులో భాగంగానే 1990లో గంగోత్రి సంస్థను స్థాపించి నాటక రంగాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నాను. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 25ఏళ్లలో 73 నాటకం, నాటికలను ప్రదర్శించాం.
 
ప్ర: మీకు ఎన్ని నంది అవార్డులు అందుకున్నారు
జ: నంది నాటకోత్సవాల్లో వ్యక్తిగతంగా ఉత్తమ దర్శకుడిగా 7, ఉత్తమ నటుడిగా 6 బంగారు  నందులతో సహా 1998 నుంచి ఇప్పటి వరకు  37 అవార్డులు వచ్చాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement