ఎస్కేయూ: ఏపీ లాసెట్–2017 ఫలితాలు సోమవారం విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ (మూడు సంవత్సరాలు ), ఎల్‌ఎల్‌ఎం (రెండు సంవత్సరాల కాల వ్యవధి కోర్సు)కు సంబంధించి టాప్–10లో జిల్లాలో ఒక్క విద్యార్థి కూడా లేడు. మూడు సంవత్సరాల నుంచి ఎస్కేయూనివర్సిటీ లాసెట్‌ను నిర్వహిస్తోంది. క్యాంపస్ కళాశాలలు, అనుబంధ లా కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సు ప్రవేశాలకు లాసెట్‌లో అర్హత తప్పనిసరి. ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిని బార్ కౌన్సిల్ విధించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో లా కోర్సు ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి వర్తించదు. కేసు పూర్తయ్యే వరకు ఏ వయస్సు వారైనా లా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.