మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో సోమవారం ఓ దారుణం వెలుగుచూసింది. తన భార్యను కాపురానికి పంపలేదని నేపంతో అల్లుడు మామాను హతమార్చాడు. గతకొన్నిరోజులుగా పుట్టింటి వద్దే భార్య ఉండటంతో తన భార్యను ఇంటికి పంపాల్సిందిగా అత్తమామలతో గొడవకు దిగాడు.
తమ కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని ఇంటికి పంపే ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో అల్లుడు ఆగ్రహించాడు. దాంతో విచక్షణ కోల్పోయిన అల్లుడు మామపై పదునైన ఆయుధంతో దాడిచేసి హత్య చేసినట్టు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
భార్యను తనతో పంపలేదని..
Published Mon, Apr 11 2016 7:32 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement