ధర్మవరం రూరల్ : మండల పరిధిలోని రేగాటిపల్లికి చెందిన విద్యార్థి తరుణ్‌కుమార్‌రెడ్డి రెండు రోజులుగా కనిపించడం లేదని తండ్రి గోపాల్‌రెడ్డి శనివారం తెలిపారు. పట్టణంలోని వివేకానంద స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడన్నారు. పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదన్నాడు. ఈ విషయమై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పాడు. ఆచూకీ తెలిసిన వారు 7013336169 నంబర్‌లో తెలియజేయాలన్నారు.