'కేంద్ర ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగానే ఉంది'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి నెలరోజుల్లో సానుకూల నిర్ణయం రావొచ్చని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఏపీ రాజధానికి కేంద్రప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించిందని.. మరికొన్ని నిధులు త్వరలోనే మంజూరు అవుతాయని తెలిపారు. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించి అరవై శాతం పని పూర్తయినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఎయిర్ పోర్ట్ అభివృద్ధి తదితర అంశాలను పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు.