శ్రీవారి ఆలయంలో మోహన్‌భగవత్, పక్కన మంత్రులు పైడికొండల, కామినేని, ఈవో సాంబశివరావు, బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి
టీటీడీ ధర్మప్రచారం భేష్
Published Thu, Aug 11 2016 7:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
– ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ ప్రశంస
సాక్షి, తిరుమల:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మప్రచారం బాగా చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ )సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం వేకువజాము అర్చన సేవలో శ్రీవారిని దర్శించున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ఎస్‌వీబీసీతో మీడియాతో మాట్లాడారు. «దర్మప్రచారానికి టీటీడీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని కితాబిచ్చారు. భక్తులు కూడా తమ సొంత ప్రాంతాల్లో భక్తిభావం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రత్యేకదర్శనం కల్పించి , రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో సాంబశివరావు, మోహన్ భగవత్‌ను పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కూడా ఆలయ అధికారులు ప్రత్యేక మర్యాదలు చేశారు. తర్వాత ఆరెస్సెస్ చీఫ్ శ్రీకాళహస్తి వెళ్లి ముక్కంటిని సందర్శించుకున్నారు.
Advertisement