వి. వెంకటరమణారెడ్డి
ఎన్‌ఎంఎం డైరెక్టర్‌గా వెంకటరమణారెడ్డి
Published Sat, Aug 13 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
యూనివర్సిటీ క్యాంపస్:
న్యూఢిల్లీలోని నేషనల్ మిషన్ ఫర్ మ్యాన్‌స్క్రిప్ట్(ఎన్‌ఎంఎం) డైరెక్టర్‌గా ఎస్వీయూనివర్సిటీ ప్రాశ్చ్యపరిశోధనా సంస్థ మాజీ సంచాలకులు ప్రొఫెసర్ వి.వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. కేంద్రప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారుు. దేశంలోని అరుదైన తాళ్ల పత్రాలు, చేతి ప్రతులను సేకరించి వాటిని ప్రాంతీయ భాషలోకి అనువదించడంతో పాటు ప్రచురించడం, వాటిని భద్రపరచడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. 2003లో ఏర్పాటైన ఈ సంస్థకు 9వ డైరెక్టర్‌గా వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. సౌత్ ఇండియా నుంచి తొలిసారిగా ఎంపికైన ఆంధ్రుడు వెంకటరమణారెడ్డి కావడం విశేషం.
Advertisement