ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం
-
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(వేదాయపాళెం): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం నేతలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో విద్యార్థి విభాగం పనితీరు ఎంతో బాగుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. హోదా రాకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉందని వివరించారు. యూనివర్సిటీలు అవినీతి కూపాలుగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థుల పక్షాన ఉద్యమాలు సాగించాలని సూచించారు. అనంతరం కాకాణిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలపాల జయవర్ధన్, జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి శ్రావణ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మదన్‌కుమార్‌రెడ్డి, హరికృష్ణయాదవ్, నేతలు వినీల్, శేషసాయి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు..
విద్యార్థి విభాగంలో పదవులు పొందిన నాయకులు మంగళవారం ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరిలో మదన్‌కుమార్, శ్రావణ్‌తో పాటు రాష్ట్ర కార్యదర్శి హాజీ, హరికృష్ణ, రాకేష్, నవీన్, పవన్, మౌనిష్ ఉన్నారు.