'సీఎం ఇప్పటికైనా కళ్లు తెరవాలి'
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తాను కేంద్రంలో చక్రం తిప్పుతానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దీనికి ఏం సమాధానం చెబుతారని కాకాణి నిలదీశారు.