ఇంత బలహీన ప్రధానిని చూడలేదు
బంకా/కటిహర్ (బీహార్): మనోహ్మన్ సింగ్ అంత బలహీనుడైన ప్రధానిని తానెప్పుడు చూడలేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ధ్వజమెత్తారు. బీహార్‌లో సోమవారం ఎన్నికల సభల్లో.. మన్మోహన్, సీఎం నితీశ్ కుమార్‌లపై విమర్శల దాడిచేశారు. అదే సమయంలో వాజ్‌పేయిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. అత్యంత బల హీన ప్రధానిగా మన్మోహన్ మిగిలిపోతారని, తన మంత్రివర్గంలోని అవినీతిని నిరోధించడంలో కూడా ప్రధాని విఫలమయ్యారని అద్వానీ విమర్శించారు.