సాక్షి సవాల్ కు ఈనాడు ఎందుకు స్పందించలేదు?
హైదరాబాద్: టైటానియం డీల్ కు సంబంధించి ఈనాడు ప్రచురించిన కథనంపై సాక్షి విసిరిన సవాల్ కు రామోజీ రావు ఎందుకు స్పందించలేదని వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పని ఈనాడు.. ఇప్పుడు డొంక తిరుగుడు కథనాలు రాస్తుందని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేత సోమిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిదని ఆమె సూచించారు. టీడీపీ నేతలు చేసే ఆరోపణలు రాజ్యాంగ సంస్థలను బ్లాక్ మెయిల్ చేసేలా ఉంటున్నాయని వాసిరెడ్డి పద్మ అన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి దమ్ము -దైర్యం ఉంటే వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ పై విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. చంద్రబాబుపై ఆరోపణలు వచ్చినా సీబీఐ విచారణ ఎందుకు జరగడం లేదని వాసిరెడ్డి ప్రశ్నించారు.