ఎలా నిద్రపోతున్నారు?
బిడ్డను నిద్రపుచ్చడానికి జోకొట్టేటప్పుడు సాధారణంగా బిడ్డను కుడిపక్కకు ఒత్తిగిలేటట్లు చేస్తుంటారు తల్లులు. అప్పుడైతే తమ కుడిచేత్తో జో కొట్టడానికి అనువుగా ఉంటుంది. ఇది అనువుగా ఉండడమే కాదు, కుడివైపుకి ఒత్తిగిలి పడుకునే వారి వ్యక్తిత్వం చాలా సమతూకంగా ఉంటుందంటారు నిద్రమీద పరిశోధనలు చేసిన అధ్యయనవేత్తలు.
అలాగే మరికొన్ని నిద్ర భంగిమల గురించి కూడా చెప్పారు.
బోర్లా పడుకునేవాళ్లు... గుంభనంగా ఉంటారు. మూర్ఖంగా, మొండిగా వ్యవహరించడానికి వెనుకాడరు. చిన్న చిన్న శబ్దాలకు మెలకువ రాకుండా ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇదో మార్గం. వెల్లకిలా పడుకునేవాళ్లు... ధైర్యంగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కోవడానికి భయపడరు. వీరికి బద్దకం తక్కువ. ఎప్పుడు నిద్రలేపినా లేవడానికి సిద్ధంగా ఉంటారు కూడ.
కదులుతూ ఉండేవాళ్లు... కొంతమంది ఉంటారు. వాళ్లు ప్రశాంతంగా కదలకుండా నిద్రపోలేరు. నిద్రపోతున్నంత సేపూ అసౌకర్యంగా కదులుతూనే ఉంటారు. వారు జీవిస్తున్న విధానం పట్ల సంతృప్తిగా లేరు అనడానికి అది ఒక చిహ్నం. మానసిక అలజడి, ఆందోళనలు ఉంటే ఇలాగే ఉంటుంది.
ముఖాన్ని కప్పుకుని నిద్రించేవాళ్లు... ప్రతి విషయానికీ భయపడుతుంటారు. సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంకాలేరు. ప్రతి విషయంలో వెనుకడుగు వేయడానికే మొగ్గుచూపుతారు.
కుడివైపుకి ఒత్తిగిలి పడుకునేవాళ్లు... వ్యక్తిత్వం వికసించిన వ్యక్తులు. సమతూకంగా వ్యవహరించగలిగిన నేర్పరులు అయిఉంటారు. ఈ నిద్రాభంగిమ మనస్తత్వానికే కాదు, దేహ ఆరోగ్యానికి కూడా మంచిదేనని వైద్యులు చెబుతుంటారు. ఇది ఇలా ఉంటే... విపరీతంగా బొజ్జ పెంచేసిన వారి నిద్రాభంగిమకీ మనస్తత్వానికీ ముడిపెట్టడం కష్టమే. వాళ్లు బోర్లా పడుకోవాలన్నా అది సాధ్యం కాక వెల్లకిలా పడుకో