గ్రీటింగ్ కార్డ్.. మళ్లీ కొత్తగా!
ఇంటిప్స్
కిందటి సంవత్సరాలలో కానుకగా వచ్చిన క్రిస్మస్ కార్డ్స్, న్యూఇయర్ కార్డ్స్‌ను చాలామంది పడేస్తుంటారు. అలా కాకుండా శాటిన్ రిబ్బన్లు, రంగురంగుల దారాలు, స్టిక్కర్లతో... వాటిని కొన్ని మార్పులు చేసి ఈ ఏడాదికి మీ శ్రేయోభిలాషులకు ఇవ్వడానికి కొత్త కానుకలను తయారుచేయవచ్చు.
కూరగాయలను ముఖ్యంగా బంగాళదుంపలను ఉడికించాక వడకట్టిన నీళ్లను పారబోస్తుంటారు. అలా కాకుండా ఈ నీళ్లు చల్లారాక మొక్కలకు పోస్తే తగినంత బలం అంది అవి ఏపుగా పెరుగుతాయి. స్టీలు పాత్రలపై వేలి ముద్రలు పడి మరకలుగా కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలా కొద్దిగా బేబీ ఆయిల్ వేసి, మెత్తని క్లాత్‌తో తుడవాలి. కొత్తవాటిలా మెరుస్తాయి.