న్యాయం గెలిచింది | At last truth prevails, YS Jagan mohan reddy gets bail | Sakshi
Sakshi News home page

న్యాయం గెలిచింది

Published Tue, Sep 24 2013 7:01 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

న్యాయం గెలిచింది - Sakshi

న్యాయం గెలిచింది

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి జైలు నుంచి జనంలోకి వచ్చేశారు. అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్ని రాజకీయాలు,ఎన్ని కుట్రలు చేసినా ఆలస్యంగా అయినా న్యాయమే గెలుస్తుందని రుజువైంది. న్యాయమే గెలిచింది. భారత న్యాయవ్యవస్థపై తమకు అపార నమ్మకం ఉందని, దేవుడు తమ పక్షానే నిలుస్తాడని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెబుతూ వచ్చారు.     అభిమానులు, కార్యకర్తలు కూడా అదే చెప్పారు. చివరకు వారు ఆశించినట్లే జరిగింది.  నేరం రుజువు కాకుండానే జగన్ను 485 రోజులు జైలులో ఉంచారు. ఆయనకు బెయిల్ రాకుండా ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం కల్పించారు. అడ్డుకుంటూ వచ్చారు. ఎంతకాలం జైలులో ఉంచగలరు? దేవుడు జగన్ పక్షాన నిలిచాడు. న్యాయం జగన్ పక్షాన ఉంది. అందుకే ఆయన బయటకు రానున్నారు. జనం కూడా జగన్ పక్షానే ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అది కూడా  తేలుతుంది.  ఆయన జైలులో ఉన్నా జనం గురించే ఆలోచిస్తున్నారు. జనం కూడా యువనేత బయటకు రావాలని ప్రార్ధనలు చేశారు.

జగన్ను జైలుకు పంపడం రాజకీయ వేధింపులలో భాగమేని అందనికి తెలిసిన విషయమే.  రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల కోసం జగన్ దీక్షలు చేసి, పోరాడి  ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. పోరాటాలు, ఉద్యమాలతో  అద్వితీయమైన ప్రజాస్పందనని కూడగట్టుకున్నారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలో చైతన్యం తీసుకువచ్చారు.  ఆయన రాజకీయాలలోకి వచ్చిన అతి తక్కువ కాలలోనే జననేతగా ఎదిగారు.అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్కు లభించిన అపూర్వ ఆదరణ, ఆయన పాల్గొన్న బహిరంగ సభలకు వచ్చే జనవాహిని చూసి తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతటి ప్రజాదరణ గల నేత యువకులలో గానీ, సీనియర్లలో గాని మరొకరు లేరని తేల్చేశారు.

జగన్‌కు లభిస్తున్న అనూహ్యమైన ప్రజాదరణను చూసి కాంగ్రెస్‌, టిడిపిలు తట్టుకోలేకపోయాయి. ఓర్వలేకపోయాయి. జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయమని వాటికి అర్దమైపోయింది. దాంతో ఆ రెండు పార్టీలు బతికిబట్టకట్టడానికే  జగన్‌ను టార్గెట్‌గా చేసుకున్నాయి. రెండూ ఏకమయయ్యాయి. కుట్ర పన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబిఐ జగన్ ఆస్తుల కేసు విషయంలో కోర్టు ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే ఆగమేఘాలమీద  రంగంలోకి దిగింది. ఇతర రాష్ట్రాల నుంచి 80 బృందాలను రప్పించింది. జగన్ ఇంటిపైన, సంస్థలపైన దాడులు చేసి, సోదాలు చేశారు. 2012 మే 27న  సిబిఐ అధికారులు  జగన్ను అరెస్ట్ చేశారు.  దర్యాప్తు పూర్తి చేయడంలో మాత్రం సిబిఐ తీవ్ర జాప్యం చేసింది. చార్జిషీట్లు దాఖలు చేయడంలో అంతకంటే ఎక్కువ జాప్యం చేశారు. జగన్ను అరెస్ట్ చేసిన 16 నెలల వరకు  ఛార్జిషీట్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. దర్యాప్తు ప్రారంభించడంలో చూపిన వేగం, చురుకుదనం పూర్తిచేయడంలో చూపలేదు.  అరెస్టు చేసిన 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలి. ఆ లోపల దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో తప్పనిసరిగా బెయిలు మంజూరు చేయాలన్న నిబంధన చట్టంలో ఉంది.  అయినా జగన్కు బెయిల్ రాకుండా అడ్డుపడ్డారు. ఇదంతా జగన్  కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినందుకేనని అందరికీ తెలిసిన విషయమే.

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తరువాత పరిస్థితుల ప్రభావంతో అనివార్యంగా రాజకీయంగా దూసుకువచ్చిన  యువకెరటం జగన్.  షర్మిల అన్నట్లు జైలులో ఉన్నా సింహం సింహమే. ఆ మహానేత మోముపై ఏ విధంగా చిరునవ్వు తాండవిస్తుందో, జైలులో ఉన్నా జగన్ మోముపై అదే చిరునవ్వు కనిపించింది. వైఎస్ మాదిరే జగన్ కూడా తమ కష్టాలు తీరుస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement