![Exact time you should go to sleep if you want to lose weight - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/15/nightsleep.jpg.webp?itok=nQnZU1xR)
బ్రిటన్: అధిక బరువుతో సతమతమయ్యే వారు కేవలం ఆహారం తగ్గించడంపైనే దృష్టి పెట్టకుండా తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో అంతరాయం లేకుండా నిద్రించడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్న వేయి మందిపై అథ్యయనం నిర్వహించగా, వారిలో తగినంతగా నిద్రిస్తున్న మూడొంతుల మంది బరువు తగ్గినట్టు వెల్లడైంది. రాత్రి పదిగంటల పది నిమిషాలకు పడుకుని ఎనిమది గంటల పాటు నిద్రించే వారు మంచి ఫలితాలు రాబట్టినట్టు తేలింది. సరిగ్గా నిద్రపోని వారు మరుసటి రోజు మరింత అధిక కేలరీల ఆహారం తీసుకున్నట్టు వెల్లడైంది.సరైన నిద్రను పాటించే ప్రతి ఐదుగురిలో నలుగురు మెరుగైన ఆహార అలవాట్లనూ అనుసరిస్తున్నట్టు తేలింది.
రాత్రి వేళల్లో ఏడు గంటల కంటే తక్కువగా నిద్రించే వారు సరైన ఆహారం తగిన మోతాదులో తీసుకోలేకపోతున్నట్టు వెల్లడైంది.వీరు భోజనాల మధ్య స్నాక్స్‌ను తరచూ తీసుకుంటుండటంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని అథ్యయనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment