స్టూడెంట్ అలియా
నటిగా ఇప్పటికే సత్తా చాటుకుంటున్న అలియా భట్, నటనలో తన నైపుణ్యానికి మరింతగా మెరుగులు దిద్దుకోవాలనుకుంటోంది. నటనలో పాఠాలు నేర్చుకునేందుకు ఆమె ఇటీవలే న్యూయార్క్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో బాడీ లాంగ్వేజ్ కోర్సులో చేరింది. ఇకపై తాను నటించే ప్రతి పాత్రకు ఈ కోర్సులో తానే నేర్చుకోబోయే పాఠాలు ఎంతో ఉపయోగపడగలవని ఆలియా చెబుతోంది. ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ఉంటేనే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నటించగలనని ఆమె అంటోంది.