సీటీబీటీవోలో భారత్‌ భాగస్వామ్యం అవశ్యం | India To Be Associated With CTBT | Sakshi
Sakshi News home page

సీటీబీటీవోలో భారత్‌ భాగస్వామ్యం అవశ్యం

Published Tue, May 21 2019 12:24 AM | Last Updated on Tue, May 21 2019 12:24 AM

India To Be Associated With CTBT - Sakshi

అణ్వస్త్ర పరీక్షల సమగ్ర నిషేధ ఒప్పందం (సీటీబీ టీ)లో భారత్‌ భాగస్వామి కావాల్సిన తరుణం ఆస న్నమైందా? ఒప్పందంపై సంతకం చేయకున్నా కనీసం పరిశీలకుడి హోదాలోనైనా భారత్‌ కంప్రహె న్సివ్‌ టెస్ట్‌బ్యాన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ కార్యకలాపాల్లో భాగస్వామి కావాలా? అవునంటున్నారు ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి లాసినా జెర్బో! దీనివల్ల భార త్‌కు లాభమే తప్ప నష్టమంటూ ఏమీ ఉండదని ఆయన విస్పష్టంగా చెప్పారు.

‘సాక్షి’తో పాటు కొంతమంది భారతీయ విలేకరులు ఇటీవల ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని సీటీబీటీవో ప్రధాన కార్యాల యాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా లాసినా జెర్బో మాట్లాడుతూ సీటీబీటీ ఉద్దేశాలు.. పరిశీలకుడి హోదాలో భారత్‌కు వచ్చే లాభాల గురించి విపులంగా వివరించారు. 

అణ్వస్త్ర పరీక్షలతో భూ వాతావరణం మరింత కలుషితం కాకుండా ఉండే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి 1996లో సీటీబీటీ ఒప్పందాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జోరుగా సాగుతున్న కాలంలో అణ్వస్త్ర పరీక్షలు విచ్చలవిడిగా జరిగేవి. ఫలితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించిన రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణానికి చేటు చేసే స్థితికి చేరాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముప్పు తప్పదన్న అంచ నాతో ఐక్యరాజ్య సమితి ముందుగా అణ్వస్త్ర పరీక్షల పాక్షిక నిషేధ ఒప్పందం (పీటీబీటీ)ని అందుబాటు లోకి తెచ్చింది. అయితే ఆ తరువాత కూడా పరీక్షల పరంపర ఏమాత్రం తగ్గకపోవడంతో పూర్తిస్థాయి నిషే ధానికి రంగం సిద్ధం చేసింది. ఫలితంగా పుట్టుకొ చ్చిందే ఈ సీటీబీటీ. 

ఈ ఒప్పందానికి అంగీకరిస్తూ ఇప్పటివరకూ 184 దేశాలు సంతకాలు చేశాయి. వీటిల్లో కనీసం 44 దేశాల ఆమోద ముద్ర పడితే ఒప్పందం అమల్లోకి వస్తుంది. అయితే భారత్‌ సహా దాదాపు ఎనిమిది దేశాలు ఇప్పటివరకూ ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టలేదు.

1967కు ముందు పరీక్షలు నిర్వహించిన దేశాలకు మాత్రమే అణ్వస్త్ర దేశాల హోదా కల్పించే ఈ ఒప్పందం పక్షపాత ధోరణితో కూడి ఉందన్నది భారత్‌ అభ్యంతరం. అదే సమయంలో భౌగోళిక భద్రత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న భారత్‌ 20 ఏళ్లుగా సీటీబీటీపై సంతకానికి ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో లాసినో జెర్బో ప్రతిపాదన ఆసక్తిక రంగా మారింది.

పరిశీలకుడి హోదాతో లాభం ఏమిటి?
సీటీబీటీ ఒప్పందంపై సంతకం పెడితేనే సీటీబీటీవో కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు అనే నిబంధన ఏదీ లేదని.. పరిశీలకుడి హోదాలో సంస్థ కార్య కలాపాల్లో పాల్గొనడం ద్వారా భారత్‌కు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతోపాటు అనేక ఇతర లాభాలు కూడా ఉంటాయని లాసినా జెర్బో ‘సాక్షి’కి తెలిపారు. భారత్‌ పరిస్థితిని, అభ్యంతరాలను తాము పూర్తిగా అర్థం చేసుకోగలమని అందుకే తాము ఒప్పం దంపై సంతకం పెట్టమని ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘భారత్‌ ఒక స్వతంత్ర, సార్వ భౌమ దేశం. సీటీబీటీ వంటి అంతర్జాతీయ ఒప్పం దంపై తనదైన నిర్ణయం తీసుకునే హక్కు ఆ దేశానికి ఉంది. అయితే పరిశీలకుడిగా చేరితే సంస్థలో జరిగే అన్ని సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. సీటీబీటీవో ఏం చేస్తోందో అర్థం చేసు కునేందుకూ వీలవుతుంది. ఆ తరువాత భవి ష్యత్తులో భారత్‌ సీటీబీటీలో చేరాలా? వద్దా? అన్నది నిర్ణయిం చుకోవచ్చు’’ అని ఆయన వివరించారు.

భూమ్మీద ఎక్కడ అణు పరీక్షలు జరిగినా గుర్తిం చేందుకు వీలుగా తాము ఎన్నో టెక్నాలజీలను అభి వృద్ధి చేశామని.. అంతర్జాతీయ పర్యవేక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మూడు వందలకు పైగా కేంద్రాలు భూకంపాలతోపాటు వాతావరణ సంబంధిత సమాచారాన్ని సేకరిస్తూంటాయన్న జెర్బో.. ఈ టెక్నాలజీలు, సమాచారం మొత్తం పరిశీల కులకు అందు బాటులో ఉంటాయని తెలిపారు.
పాకిస్తాన్‌ ఇప్పటికే పరిశీలకుడి హోదాను స్వీక రించేందుకు తమ సమ్మతి తెలిపిందని.. భారత్‌ కూడా అంగీకరిస్తే... అంతర్జాతీయ సమాజానికి పెద్ద మేలు జరుగుతుందని జెర్బో చెప్పారు. వచ్చే నెల 24 నుంచి వియన్నాలోని హాఫ్‌బర్గ్‌ ప్యాలెస్‌లో జరిగే ఎస్‌ఎన్‌టీ 2019 సదస్సుకు హాజరు కావాలని సీటీబీటీవో ఎగ్జి క్యూటివ్‌ కార్యదర్శి లాసినా జెర్బో భారత్‌ను ఆహ్వానిం చారు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు చెందిన వెయ్యిమంది శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొం టారని ఆయన చెప్పారు.
గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా,
సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement