తండ్రిని, వదినను రోకలిబండతో కొట్టి చంపాడు | son attack on father in mahabubnagar | Sakshi
Sakshi News home page

తండ్రిని, వదినను రోకలిబండతో కొట్టి చంపాడు

Published Sat, Nov 28 2015 9:19 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

son attack on father in mahabubnagar

దౌలతాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని, వదినను రోకలబండతో మోది చంపాడో వ్యక్తి.  వివరాలు.. మండలంలోని చంద్రకల్ గ్రామానికి చెందిన అశోక్(28)కు 5 సంవత్సరాలుగా మతిస్థిమితం సరిగా లేదు. శనివారం తెల్లవారు జామున ఒక్కసారిగా రోకలి బండతో తండ్రి సాయన్న(50) పైకి దాడికి దిగాడు.
 
అది గమనించి అడ్డొచ్చిన వదిన లక్ష్మీ(30)పై కూడా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే కూలి పోయింది. ఈ ఘటనలో తండ్రి, లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందగా..కుటుంబసభ్యులు భయంతో పారిపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement