సస్పెండ్ చేశాకే కాంగ్రెస్‌లో చేరా
మాజీ ఎంపీ విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్‌ఎస్ పార్టీ నన్ను 2013 జూన్‌లోనే సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఎనిమిది నెలలకు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందాక మాత్రమే కాంగ్రెస్‌లో చేరా’ అని మాజీ ఎంపీ విజయశాంతి చెప్పారు. ఎన్నికల సమయంలో విజయశాంతిని ఎలా చేర్చుకున్నారని కేసీఆర్ కాంగ్రెస్‌ను నిలదీసిన అంశంపై ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుట్రలు, అబద్ధపు సమాచారంతో తనను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారన్నారు. అయితే సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసిన నాయకులుగా తాను, కేసీఆర్ పరస్పరం ఎంతో గౌరవించుకున్నామన్నారు.