'అధికారులకు సెలవులు రద్దు'
'అధికారులకు సెలవులు రద్దు'
Published Wed, Sep 21 2016 12:53 PM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM
హైదరాబాద్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇరిగేషన్ శాఖలో ఎమర్జెన్సీ, ఇంజినీరింగ్ అధికారుల సెలవులు రద్దు చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...చెరువులకు గండ్లు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
గండ్లు పడిన చెరువులకు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనాలని హరీశ్ చెప్పారు.
Advertisement
Advertisement