కేంద్రాన్ని ఒప్పించాల్సింది మీరే | Jeevan Reddy reference to CM | Sakshi
Sakshi News home page

కేంద్రాన్ని ఒప్పించాల్సింది మీరే

Published Thu, Jan 19 2017 2:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కేంద్రాన్ని ఒప్పించాల్సింది మీరే - Sakshi

కేంద్రాన్ని ఒప్పించాల్సింది మీరే

12 శాతం ముస్లిం రిజర్వేషన్లపై సీఎంకు జీవన్‌రెడ్డి సూచన

  • మైనార్టీ సబ్‌ ప్లాన్‌ తేవాలని విజ్ఞప్తి
  • మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం: కిషన్‌రెడ్డి
  • తొందర వద్దు.. అధ్యయనం చేసి పక్కాగా చేయండి: అక్బరుద్దీన్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ముస్లిం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం కాదు.. 12 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందేలా కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది’ అని కాంగ్రెస్‌ నేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌.. ప్రధానితో ఉన్న సత్సంబం ధాలను వాడుకొని రిజర్వేషన్లు సాధించాలని డిమాండ్‌ చేశారు. 12 శాతం ముస్లిం రిజర్వే షన్లను మతకోణంలో కాకుండా సామాజిక, ఆర్థిక వెనుకబాటు కోణంలో చూడాలన్నారు.  బుధవారం మైనార్టీ సంక్షేమంపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడారు. మైనారి టీలకు బడ్జెట్‌లో నిధుల కేటాయిం పులు జరు గుతున్నా ఖర్చు మాత్రం జరగడం లేదని పేర్కొన్నారు. ‘మైనారిటీ సెల్ఫ్‌ ఎంప్లా య్‌మెంట్‌ కోసం 2014–15, 2015–16లో రూ.274 కో ట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా రూ.90 కోట్లే ఖర్చు చేశారు. రూ.1,100 కోట్ల బడ్జెట్‌ పెట్టినా రూ.606 కోట్ల ఖర్చే జరిగింది. బీసీలకు తేను న్న సబ్‌ప్లాన్‌ మాదిరే మైనార్టీ సంక్షేమానికి సబ్‌ ప్లాన్‌ రూపొందించాలి.’ అని సూచించారు. ఇమామ్, మౌజమ్‌లకు గౌరవభృతిని రూ.5 వేలకు పెంచాలని కోరారు.

బిల్లు ఎలా పెడతారు?: కిషన్‌రెడ్డి
మతపరమైన రిజర్వేషన్లు మంచిది కాదని, రాజ్యాంగ వ్యతిరేకమని బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనమే చె ప్పిం దన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వే షన్ల కేసు సుప్రీంకోర్టులో ఉందని, దానిపై స్టే ఉన్నా అమలు చేస్తున్నామన్నారు. ఈ అంశం కోర్టులో ఉండగా సభలో బిల్లు పెడితే సబ్‌జ్యుడీస్‌ అవుతుందన్నారు. ముస్లింలు, అన్ని వర్గాల్లోని పేదలను ఒక యూనిట్‌గా చేసి రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుందని సూచిం చారు. ‘దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రాష్ట్ర పరిధిలోని కాదు. పార్లమెంటు పరిధిలోనిది.  అలా చేస్తే సామూహిక మత మార్పిడులకు కారణం అవుతుంది. విదేశాల నుంచి వచ్చే డబ్బుతో భారీ మత మార్పిడులు జరుగుతు న్నాయి. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది సామాజి క ఉద్రిక్తతను పెంచే చర్యగా ఉంది. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి’’అని అన్నారు.

ఎన్టీఆర్‌ కృషి చెబితే బాగుండేది: రేవంత్‌
మైనారిటీ సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని, ఆయన వర్ధంతి రోజున ఈ అంశం చర్చకు వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మైనారిటీల కోసం మైనారిటీ కమిషన్‌ ఏర్పాటు చేశారని, ఉర్దూను అధికార భాషగా చేశారన్నారు. వాటి గురించి చెబితే బాగుండేదన్నారు.

వైఎస్‌ ఇచ్చిన 4 శాతంతో ఎంతో లబ్ధి
వేలాది మందికి విద్య, ఉద్యోగావకాశాలు వచ్చాయి: అక్బరుద్దీన్‌

రిజర్వేషన్లపై తొందర అవసరం లేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు. ‘12 శాతం ముస్లిం రిజర్వేషన్లను త్వరగా తేవాలని కోరుతున్నవారు వాటిని ఎలా అమలు చేయాలో చెప్పలేకపోతున్నారు. 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం తొందర పడితే ఉన్న 4 శాతం రిజర్వేషన్లు పోతా యి. దీనిపై పూర్తిస్థాయి చర్చలు, అధ్యయనం చేసి పక్కాగా అమలు చేయండి. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో కాకుంటే.. ఆ తర్వాతి సమావేశాల్లో బిల్లు తీసుకురండి. కానీ పక్కాగా తీసుకురావాలి’అని పేర్కొన్నారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేశారు. ఇప్పుడు అదే అమల్లో ఉంది. వైఎస్సార్‌ హయాంలోనే ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ముస్లిం విద్యార్థులకు ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇచ్చారు.

అప్పుడిచ్చిన ప్రోత్సాహంతోనే ఇప్పటికీ చదువుకుంటున్నారు. వందలాది మంది 4 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు చేస్తున్నారు. వేలాది మంది వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేశారు’ అంటూ వైఎస్‌ను కొనియాడారు. ఉర్దూ భాష క్రమంగా మరుగున పడుతోందని, దాన్ని కాపాడేందుకు ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ఉర్దూలోనూ నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇంగ్లిష్‌ మీడి యం రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉర్దూ పండిత్‌లను నియమించాలన్నారు. నీట్‌ పరీక్షను ఉర్దూలో నిర్వహించేలా కేంద్రానికి విన్నవించాలని, ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని కోరారు. క్రిస్టియన్‌లో చేరిన దళితులను ఎస్సీలుగా పరిగణిస్తున్నట్లే, ముస్లింలో చేరే దళితులను కూడా ఎస్సీలుగానే పరిగణించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement