వంద నోటే కింగ్
హైదరాబాద్: ఇన్నాళ్లూ బ్యాంకు కెళితే.. ’సార్ కాస్త పెద్ద నోట్లుంటే ఇవ్వరా. తీసుకెళ్లేందుకు సులభంగా ఉంటుందని‘ చెప్పటం, వినటం చాలా సహజం. కానీ ఇప్పుడు మాత్రం వందనోటుదే పెత్తనమంతా. జేబులో రూ500 ఉన్న వ్యక్తికన్నా.. వందనోటు జేబులో ఉన్నోడే హీరో. కొత్త నోటు వచ్చే వరకు రూ.100 జేబులో ఉంటే ఆ లెక్కే వేరు. అందుకే.. మంగళవారం ప్రధాని ప్రకటన వెలువడిన తర్వాత ఏటీఎంల దగ్గర క్యూలు కట్టారు. కొందరు వందనోటు కోసం వస్తే.. మరికొందరు తమ దగ్గరున్న పెద్దనోట్లను డిపాజిట్ మిషన్ల ద్వారా అకౌంట్లో వేసేందుకు లైన్లో నిలుచున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ఏటీఎంలన్నీ కిటకిటలాడారుు.
దీంతో జనాలను అదుపుచేయలేక చాలా చోట్ల గార్డులు ఏటీఎంల షటర్లు దించేశారు. ఏటీఎంలు మాత్రమే కాదు పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఇవే పొడవైన లైన్లు. వందరూపాయల పెట్రోల్ కోసం పెద్ద నోట్లు ఇస్తే.. కాసేపు అంగీకరించినా రద్దీ పెరుగుతున్న కొద్దీ తిరస్కరించక తప్పలేదు.