ఇక చెల్లవు
ఆసిఫాబాద్ : పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేం దుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ప్రధాని మోడీ ఇచ్చిన యాభై రోజుల గడువు చివరి రోజు జిల్లాలోని బ్యాంకులు వినియోగదారులతో కిటకిటలాడాయి. బ్యాంకుల వద్ద భద్రత పెంచినా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. మార్చి 31 వరకు పాత నోట్లు రిజర్వ్ బ్యాం కుల్లో మాత్రమే జమ చేసుకోవచ్చు. కానీ డిపాజిట్ చేసే వారు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అనుమానం వస్తే చర్యలు తప్పవు. గత యాభై రోజులుగా నగదు కోసం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆర్‌బీఐ బ్యాంకుల్లో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు విధిం చడం, ఏటీఎంలు పని చేయకపోవడంతో ప్రజ లు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం జిల్లా కేం ద్రం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీతో పాటు రెబ్బెన, వాంకిడి, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లో ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాం కు, లక్ష్మీవిలాస్ బ్యాంకులు ఏటీఎంలు ఏర్పాటు చేశాయి. కానీ అవి పని చేయక పోవడంతో నగదుకోసం గంటల తరబడి బ్యాంకుల ఎదుట నిరీక్షించాల్సి వచ్చింది. నిత్యావసరా వస్తువుల కోసం డబ్బు దొరక్క ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు యాభై రోజులుగా బ్యాంకుల్లో సాధారణ లావాదేవీలు జరగలేదు.
వినియోగదారుల పాట్లు
కరెన్సీ కోసం అల్లాడుతున్న వినియోగదారులు బ్యాంకు వద్ద రద్దీతో అసహనంతో వెనుతిరిగిపోయారు. పెద్ద నోట్ట రద్దు ప్రభావంతో యాభై రోజులుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసరాలకోసం తాము దాచుకున్న నగదు కోసం వచ్చిన వినియోగదారులు సిబ్బంది పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఎస్‌బీహెచ్ బ్యాంకు వద్ద కంప్యూటర్లు మొరాయించడంతో కొంత సేపు లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. నగదు విత్‌డ్రా కోసం బ్యాంకులకు వచ్చిన ఉద్యోగులు, రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకు సిబ్బంది పనితీరుపై ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్లు అవస్థలు పడ్డారు. దీంతో అత్యవసరాల కోసం వినియోగదారులు అవస్థలు పడ్డారు. శనివారం ప్రధాని మోడీ జాతినుద్దేశించి ఎలాంటి ప్రకటన చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాల్లో నల్లధనం నుంచి డబ్బులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని ఇచ్చిన యాభై రోజుల గడువు ముగియడంతో ఇక మంచి రోజులు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పాత నోట్లు, పెద్ద నోట్ల డిపాజిట్ల వివరాలు చెప్పకుండా బ్యాంకు అధికారులు గోప్యత పాటించారు.