ఏపీ మంత్రులతో లోకేశ్ భేటీ | Nara Lokesh meets with AP Ministers over GHMC election campaign | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రులతో లోకేశ్ భేటీ

Published Sat, Jan 23 2016 3:39 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

ఏపీ మంత్రులతో లోకేశ్ భేటీ - Sakshi

ఏపీ మంత్రులతో లోకేశ్ భేటీ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ వ్యూహారచనలు సిద్ధం చేస్తుంది. టీడీపీకి ప్రధాన ప్రచారకుడిగా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వ్యవహరించనున్నారు.

శనివారం సాయంత్రం లోకేశ్ ఆంధ్రప్రదేశ్ మంత్రులతో భేటీ కానున్నారు. గ్రేటర్లో ఏపీ మంత్రులతో ప్రచారం చేయించే అంశంపై ఈ సమావేశంలో లోకేశ్ చర్చించనున్నారు. గ్రేటర్లో టీడీపీ పోటీ చేస్తున్న 92 డివిజన్లతో పాటు మిత్రపక్షం బీజేపీకు చెందిన కొన్ని డివిజన్లలో ఏపీ మంత్రులతో ప్రచారం చేయించడానికి టీడీపీ కసరత్తులు చేస్తుంది. సెటిలర్లను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా లోకేష్‌తో వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించేలా చంద్రబాబు తెలంగాణ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement