‘రైతులను దోచుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లలో దళారులు, వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పాటై రైతులను దోచుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు చెందిన మార్కెట్‌యార్డు నేతలూ వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారన్నారు.
సోయాకు రూ.2,775ల కనీస మద్ధతు ధరను ప్రభుత్వం ప్రకటించగా వ్యాపారులు తొలిరోజు మినహా సగం ధరను తగ్గించారని వివరించారు. మొక్కజొన్నకు రూ.1,900 ధర ఉండగా 1,200కు తగ్గించారని తెలిపారు. ఈ సమస్యపై జోక్యం చేసుకోవాల్సిన మార్క్‌ఫెడ్ అధికారులు మౌనం వహించడం వెనుక మర్మం ఏమిటని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.