హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఉత్తమ్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరోసారి భేటీ అవుతామని ఉత్తమ్ తెలిపారు.
ముగిసిన టీ కాంగ్రెస్ సమన్వయ భేటీ
Published Thu, Dec 3 2015 12:09 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM
Advertisement