క్రికెట్ బెట్టింగ్స్‌పై గురి | Twenty20 Cricket World Cup :-India, West Indies match Cricket betting danda | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్స్‌పై గురి

Published Fri, Apr 1 2016 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

క్రికెట్ బెట్టింగ్స్‌పై గురి

క్రికెట్ బెట్టింగ్స్‌పై గురి

మరో 11 మందిని పట్టుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు
రూ. 9.28 లక్షల నగదు  26 సెల్‌ఫోన్లు స్వాధీనం
 

 
 సాక్షి, సిటీబ్యూరో:  జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టును మల్కాజిగిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు మరోసారి రట్టు చేశారు. మూడు రోజుల క్రితం కుషాయిగూడ పరిధిలో ఏడుగురు సభ్యుల బెట్టింగ్ ముఠాను పట్టుకున్న ఇదే ఎస్‌ఓటీ బృందం... టీ-20 క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్‌కు భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయన్న సమాచారంతో మేడిపల్లి, కుషాయిగూడ, వనస్థలిపురం ఠాణా పరిధిల్లో దాడి చేసి..11 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి పోలీసులు రూ. 9,28,299ల నగదు, ఒక ల్యాప్‌టాప్, 26 సెల్‌ఫోన్లు, రెండు కౌంటింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 29 మంది కోసం గాలిస్తున్నారు. ఎస్‌ఓటీ అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...

 ఐదేళ్ల నుంచి...
 సైదాబాద్ కాలనీకి చెందిన సీహెచ్ ప్రవీణ్‌కుమార్ ఐదేళ్లుగా నేరేడ్‌మెట్‌లో నివాసముంటున్న రాజస్థాన్ వాసి చేతన్ కుమార్‌తో కలిసి క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. మరో ఇద్దరు నిందితులు సంపత్, పండులతో కలిసి కుషాయిగూడ, ఉప్పల్, మేడిపల్లి, ఘట్‌కేసర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఒక్కో మ్యాచ్‌కు పంటర్‌ల నుంచి రూ.20 లక్షల నుంచి 25 లక్షలు వసూలు చేస్తున్నాడు.  బోడుప్పల్‌లోని పాండు నివాసంలో పాండు, సుభాష్ చావ్లేలతో బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. 25 సెల్‌ఫోన్ల సహాయంతో బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్ నుంచి జన్నాత్, ప్రిన్స్, చిన్నా, చంద్, యోగేశ్‌లు ప్రవీణ్‌కుమార్ మార్గదర్శనంలో బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. అలాగే వనస్థలిపురానికి చెందిన సత్య సురేశ్, హరీశ్ కుమార్, నాగరాజు  సంయుక్తంగా వనస్థలిపు రం, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ని అమలాపురం, విశాపట్నంల్లోనూ బెట్టింగ్స్‌కు తెరలేపారు. పంటర్‌ల నుంచి డబ్బులు సేకరించేందుకు రవితేజ, క్రాంతికిరణ్ అనే అన్నదమ్ములను వినియోగించుకుంటున్నారు. లాలాపేటకు చెందిన మరో క్రికెట్ బుకీ కిశోర్‌గౌడ్ నేరేడ్‌మెట్ ఠాణా పరిధిలో క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. ఇతను సంతోష్‌కుమార్, రమేశ్ అనే ఇద్దరి సహకారంతో పంటర్‌ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు.


 ఏకకాలంలో దాడులు...
 సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎస్‌ఓటీ అదనపు డీసీపీ ఈ.రాంచంద్రారెడ్డి నేతృత్వంలోని మల్కాజిగిరి ఎస్‌ఓటీ బృందం క్రికెట్ బెట్టింగ్స్‌పై ఆరా తీసింది. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ-20 సెమీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో మల్కాజిగిరి జోన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గురువారం ఏకకాలంలో ఆయా ప్రాంతాల్లో దాడి చేసి సీహెచ్ ప్రవీణ్‌కుమార్, సీహెచ్ సంపత్‌కుమార్, ఎం.పాండు, సుభాష్ చావ్లే, ఎం.నారాయణ, కొరడా రవితేజ, మావూరిదేవ సుబ్రహ్మణ్యం, కర్నాటి అనిల్ కుమార్, ముతపురం శ్రీనివాస్, కిశోర్‌గౌడ్, పెద్ది సంతోష్ కుమార్, పరిగి రమేశ్‌లను అరెస్టు చేశారు. వీరిలో  ప్రధాన బుకీలు, కలెక్షన్ ఏజెంట్లు, పంటర్‌లు, లైన్ ఆర్గనైజర్లు ఉన్నారు, అయితే మరో 29 మంది కోసం గాలిస్తున్నారు.
 
 
 బషీర్‌బాగ్‌లో మరో ఇద్దరి అరెస్ట్

 ఖైరతాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని సైఫాబాద్ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ మహాలక్ష్మయ్య కథనం ప్రకా రం.... మలక్‌పేట నివాసి జస్విందర్‌సింగ్ అలి యాస్ రాంకీ (34), కుత్బుల్లాపూర్ నివాసి అషఫ్ ్రఅలియాస్ అహ్మద్(26) ఢిల్లీ కేంద్రంగా వాట్సాఫ్ ద్వారా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి బషీర్‌బాగ్‌లో కారులో వీరిద్దరూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.53 వేల 500 నగదు, రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. జస్విందర్‌సింగ్,అషఫ్‌ల్రపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement