హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. మిర్యాలగూడలో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైం ది. మరోవైపు హన్మకొండలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం
ఉదయం, మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం.. ప్రధాన రహదారులు జలమయం.. ఇదీ మంగళవారం హైదరాబాద్‌లో పరిస్థితి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలోని ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం నీరు రోడ్లపై నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు గరిష్టంగా 40.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వడదెబ్బతో 27 మంది మృతి చెందారు.
ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
హన్మకొండ 43.5
ఆదిలాబాద్ 42.8
రామగుండం 42.8
నల్లగొండ 42.8
నిజామాబాద్ 42.0
ఖమ్మం 42.0
మెదక్ 40.4
హైదరాబాద్ 40.2
మరో రెండు రోజులు వర్షాలు
Published Wed, Jun 1 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement