తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
పెద్దాపురంలో 10 సెంటీమీటర్లు, చోడవరంలో 9 సెం.మీ, చింతలపుడి, తాడేపల్లి గూడెంలలో 7 సెం.మీ, విజయనగరం, బాపట్లతో 6 సెం.మీ, నర్సీపట్నం, పోలవరంలలో 5 సెం.మీ, ఎమ్మిగనూరు, మదనపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కొల్లాపూర్, అశ్వరావుపేటలలో 4 సెంటీమీటర్లు, చిన్నారావుపేటలో 3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.