హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఒడిషా తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తాలో పలుచోట్లు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
Published Sun, Jul 10 2016 9:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM
Advertisement