ఆయనెందుకు మౌనంగా ఉన్నారు? | why chandra babu is silent on telangana projects, questions buggana rajendranath reddy | Sakshi
Sakshi News home page

ఆయనెందుకు మౌనంగా ఉన్నారు?

Published Wed, May 11 2016 3:22 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM

ఆయనెందుకు మౌనంగా ఉన్నారు? - Sakshi

ఆయనెందుకు మౌనంగా ఉన్నారు?

ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మించతలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే పునరావృతం అవుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 16, 17, 18 తేదీలలో కర్నూలులో జరిగే జగన్ దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement