హక్కుల రక్షణకు పటిష్ట యంత్రాంగం ఉండాలి | ysrcp mp velagavalli talking about protection rights of Dalits | Sakshi
Sakshi News home page

హక్కుల రక్షణకు పటిష్ట యంత్రాంగం ఉండాలి

Published Thu, Feb 25 2016 4:32 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

హక్కుల రక్షణకు పటిష్ట యంత్రాంగం ఉండాలి - Sakshi

హక్కుల రక్షణకు పటిష్ట యంత్రాంగం ఉండాలి

దళితుల హక్కులపై లోక్‌సభలో
వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి

సాక్షి, న్యూఢిల్లీ: దళితుల హక్కుల రక్షణకు పటిష్ట యంత్రాంగం ఉండాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద రావు పేర్కొన్నారు. జేఎన్‌యూ, హెచ్‌సీయూ సంఘటనలపై  బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘జేఎన్‌యూ, హెచ్‌సీయూ సంఘటనలు రెండు వేర్వేరు అంశాలు. రోహిత్ వేములను ఆత్మహత్యకు పురిగొల్పారు. దానికి కారణాలేంటి? భవిష్యత్తులో అవి మరోసారి ఉత్పన్నం కారాదని ప్రభుత్వాన్ని కోరుతున్నా. రోహిత్ పేద దళిత కుటుంబం నుంచి వచ్చాడు. ప్రతిభతో అడ్మిషన్ సంపాదించాడు.  రోహిత్‌కు 6నెలలు జేఆర్‌ఎఫ్ ఫెలోషిప్ ఇవ్వలేదు. అతడు బయట బతికేందుకు డబ్బులు లేవు. విద్యార్థులను లైబ్రరీకి, మెస్‌కు రాకుండా చేస్తే వాళ్లు ఎక్కడికి వెళతారు? హైదరాబాద్ వర్సిటీ స్థాపించినప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో దళితులకు ప్రాతినిధ్యమే లేదు.  సస్పెన్షన్ చిన్న విషయమని కేంద్ర మంత్రి అంటారు. కానీ అది చిన్న విషయం కాదు. దళితులకు అదొక జీవిత సమస్య..’ అని పేర్కొన్నారు.

 ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం ఉంది..
‘ఈ సంఘటన వెనక ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం ఉంది. విద్యార్థులు తలపడితే ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలి? ’ అని పేర్కొన్నారు.వర్సిటీలు తమ వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నాయి. విద్యార్థులకు వాళ్ల హక్కులు వాళ్లకు ఉన్నాయి. మనం ఎందుకు ప్రతిస్పందించాలి? దళితులు, బలహీన వర్గాల హక్కుల రక్షణకు ఒక పటిష్టమైన యంత్రాంగం ఉండాలి..’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement