చైనాలో మావో జెడాంగ్ భారీ విగ్రహం
చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్కు భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఆయన మృతి చెందిన 40 ఏళ్ల తర్వాత చైనాలోని ఓ మారుమూలు గ్రామంలో మావో భారీ విగ్రహాన్ని నిర్మించారు. 36మీటర్ల ఎత్తున్న విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు మూడు కోట్ల రూపాయల పైనే ఖర్చు అయింది. ఈ విగ్రహాన్ని స్టీల్, కాంక్రీట్ లతో నిర్మించి బంగారు రంగు వేశారు. ఈ గోల్డెన్ స్టాట్యూను హెనన్ ప్రావిన్స్ లోని కైఫెంగ్ సమీపంలో ఏర్పాటు చేయగా ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన మావో విగ్రహాన్ని స్థాపించేందుకు గ్రామస్తులు కూడా విరాళాలు సేకరించారు. మావో విగ్రహాన్ని పేద కళకారులు తయారుచేయడం విశేషం. 1893 డిసెంబర్ 26న జన్మించిన మావో.. సెప్టెంబర్ 9, 1976లో మృతిచెందారు.
అయితే ఇటీవలే మావో జెడాంగ్ రాసిన లేఖ రికార్డు స్థాయిలో వేలంలో అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. మావో జడాంగ్ 1937లో బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు క్లెమెంట్ అట్లీకి రాసిన అరుదైన లేఖను లండన్ లో వేలంలో పెట్టారు. చైనాకే చెందిన ఓ వ్యాపారవేత్త వేలంలో రూ. 6.50 కోట్లకు లేఖను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.