సానుకూల ఫలితంపై ధీమా!
పారిస్: ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించటం, ఓ ప్రభావవంతమైన పర్యావరణ ఒప్పందం అమలుకు.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రపంచ పర్యావరణ సదస్సులో ఓ సానుకూల ఫలితం వస్తుందని భారత్ ధీమా వ్యక్తం చేసింది. సరైన లక్ష్యాల్లేకుండా పారిస్ సదస్సు ముగియకుండా చూస్తామని ఆదివారం భారత పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే.. పర్యావరణ ఒప్పందంపై ఇప్పటివరకు చాలా స్వల్ప పురోగతి మాత్రమే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
సమావేశాలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నా.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు.. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికసాయం చేయాలనే విషయంపై పూర్తి ఏకాభిప్రాయం రాలేదు. ఈ నేపథ్యంలో నేటి నుంచి మొదలు కానున్న సభ్యదేశాల మంత్రుల సమావేశం ఆసక్తికరంగా మారింది.