స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధుల బారినుంచి బయటపడటానికి అమెరికా, పశ్చిమ యూరప్, మధ్యాసియా ప్రాంతాల్లోని చిన్నలు, పెద్దలు కలసి సగానికి తగ్గించిన చక్కెర పదార్థాలను లాగించేస్తున్నారంట. అందుకు ప్రధాన కారణం ఒబేసిటీ, దంతక్షయం నుంచి బయటపడాలనే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో కనీసం పదిశాతానికి తక్కువగా షుగర్ లెవల్ ఉండేలా జాగ్రత్త పడితే బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.
అయితే, చాలామంది 15శాతానికి పైనే చక్కెర కలిగిన పదార్థాలను తీసుకుంటున్నారని దీనితో పలు దీర్ఘకాలిక వ్యాధులు (క్రానిక్ డిసీజెస్) వస్తాయని, అదే 5శాతం చక్కెర తీసుకుంటే వారికి క్యాన్సర్, గుండెజబ్బులు వంటివాటిని కూడా దరిచేరనీయకుండా చేయొచ్చని చెబుతోంది. చిరుతిండ్లే అన్ని సమస్యలకు కారణమని పేర్కొంది. అయితే, షుగర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి సంస్థలు మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలలో పసలేనివని, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని పెదవి విరిచాయి. క్రానిక్ వ్యాధులకు, షుగర్కు సంబంధం లేదని అంటున్నాయి.